రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రద్దీ | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రద్దీ

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

చౌటుప్పల్‌ : రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్‌ విలువను పెంచాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు రద్దీగా మారాయి. ధరలు నూరు శాతం పెరగనుండడంతో జనం ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు చేయించుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయేతర భూములకు సాధారణ రోజుల్లో 48స్లాట్లు ఉండగా ప్రస్తుతం మరో 32 అదనంగా పెంచారు. వ్యవసాయ భూములకు మాత్రం యథావిధిగా 30స్లాట్లు ఉన్నాయి. ధరల పెంపు నిర్ణయానికి ముందు చౌటుప్పల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వ్యయసాయేతర రిజిస్ట్రేషన్లు 48స్లాట్లలోపుగానే జరిగేవి. ఇప్పుడు మాత్రం రెండింతలు పెరిగాయి. వ్యవసాయ భూములకు సంబంధించి తహసీల్దార్‌ కార్యాలయాల్లో 10–15వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగనుండగా ప్రస్తుతం 30 అవుతున్నాయి. ధరలు పెరిగితే తమపై భారీగా ఆర్థిక భారం పడుతుందని భావించి జనాలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు.

ఫ భూముల మార్కెట్‌ విలువ పెంపు నేపథ్యంలో పెరిగిన రిజిస్ట్రేషన్లు

ఫ రిజిస్ట్రేషన్ల కోసం భారీగా తరలివస్తున్న జనం

Advertisement
 
Advertisement
Advertisement