దండుమల్కాపురంలో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌.. | - | Sakshi
Sakshi News home page

దండుమల్కాపురంలో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌..

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

దండుమల్కాపురంలో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌..

చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌కు 2019 నవంబర్‌ 1న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశారు. 2022లో ఆయన చేతుల మీదుగానే ఇండస్ట్రియల్‌ పార్క్‌ను ప్రారంభించారు. మొదటి విడతలో 460 ఎకరాల విస్తీర్ణంలో 450 పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా భూ కేటాయింపులు జరగగా ప్రస్తుతం శరవేగంగా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. రూ. 2500 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పార్కు ఏర్పాటు చేసింది. ప్రత్యక్షంగా 15,000 పరోక్షంగా 40,000 మందికి ఉపాధి లభించనుంది. గత సంవత్సరం సుమారు 80 వేల మందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం మరో 1500 ఎకరాల భూసేకరణ జరుగుతోంది. కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకు ఈ పార్కు స్థలాలు కేటాయిస్తుంది. ఈపార్కులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులు తయారవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement