నడిగూడెం : నాటి మునగాల పరగణాకు పాలనా కేంద్రమైన నడిగూడెం రాజావారి కోటలో పలు రకాల వస్తువులు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. నడిగూడెం రాజావారి కోటలో 1921లో నడిగూడెం జమీందారు రాజానాయిని వెంకటరంగారావు వద్ద వ్యవసాయాధికారిగా పని చేస్తూ, పరగణాలోనే తొలిసారిగా పత్తి పంటను పరిచయం చేసిన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వాడిన టేబుల్, కుర్చీ నేటికీ చెక్కు చెదరలేదు. అలాగే అదే కోటలో నాడు 1919 మే 27న సంఘ సంస్కర్త కందుకూరు వీరేశలింగం నడిగూడెం రాజావారి కోటను సందర్శించి కూర్చున్న కుర్చీ ఇంకా పదిలంగా ఉంది. అదే కుర్చీలో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు 1923 జులై 13న అదే కుర్చీలో కూర్చొని మహారాష్ట్ర చరిత్రను చదివి అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తూ తుదిశ్వాస విడిచారు. తదనంతరం 1923 నుంచి 1956 వరకు అదే కుర్చీలో కళా ప్రపూర్ణ, మునగాల పరగణా జమీందారు రాజానాయిని వెంకటరంగారావు కూర్చొని చదువుకునేవారు. ఇక 125 ఏళ్ల క్రితం రాజావారు వాడిన ఉయ్యాల కూడా నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. వీటన్నింటినీ నడిగూడెం రాజావారి కోటలో డక్కన్ ఆర్కైవ్స్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జితేంద్ర బాబు ఆధ్వర్యంగా నాలుగేళ్ల కిందట కోటకు పూర్వ వైభవనం కనిపించేలా తీర్చిదిద్ది ప్రదర్శనగా పెట్టారు.
వందేళ్ల క్రితం రాజానాయిని వెంకట రంగారావు
ఉపయోగించిన ఉయ్యాల
కందుకూరు వీరేశలింగం పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, రాజానాయిని వెంకట రంగారావు వాడిన కుర్చీ
పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పనలో
భాగంగా ఉపయోగించిన టేబుల్


