కనగల్: మండల పరిధిలోని బుడుమర్లపల్లి గ్రామ వాగులో ఇసుక పొర కూలి కనగల్ గ్రామానికి చెందిన పాలకూరి సునిత(45) శనివారం మృతిచెందింది. పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. సునీత రోజు మాదిరిగా బుడుమర్లపల్లి వాగు ఇసుక రీచ్ వద్దకు దినసరి కూలీగా ఉదయం 5గంటల వెళ్లి తిరిగి ఉదయం 9గంటలకు ఇంటికి చేరుకుంటుంది. ఈ క్రమంలో వాగులో నాణ్యమైన ఇసుకను తోడేందుకు వాగులోకి వెళ్లింది. ట్రాక్టర్‌లో ఇసుక లోడ్ పూర్తి చేసిన అనంతరం తిరిగి పార కోసం ఇసుక తీసిన ప్రాంతానికి సునీత వెళ్లింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా పైన ఉన్న ఇసుక పొరతోపాటు మట్టిపెళ్ల్లలు పడడంతో అందులో కూరుకుపోయి మృతిచెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఇసుకలో కూరుకుపోయిన సునీత మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాకు దిక్కెవరు..
మృతురాలు సునీతకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఇద్దరికీ వివాహమైంది. భర్త యాదయ్య గత ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. తాను సొంతంగా పనులు చేసుకోలేడు. నాకు దిక్కెవరని, తనకు ఇంక తోడు ఎవరుంటారని కన్నీటి పర్యంతమయ్యాడు. అతడి రోదిస్తున్న తీరును చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు.
ఫ వాగులో ఇసుక తోడేందుకు
వెళ్లిన మహిళా కూలీ
ఫ మట్టిపెళ్ల్లలు పడడంతో అందులో
కూరుకుపోయి మృతి
ఫ కనగల్ మండలం
బుడుమర్లపల్లి వాగులో ఘటన


