ఫ్లైఓవర్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఫ్లైఓవర్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

ఫ్లైఓవర్‌పై ప్రమాదాల నివారణకు చర్యలు

గుట్ట డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు

ఆలేరు : ఆలేరు పట్టణంలోని ఫ్లై ఓవర్‌పైన ప్రమాదాల నివారణపై దృష్టి సారించినట్టు గుట్ట డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు పేర్కొన్నారు. శనివారం జిల్లా ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి ఆయన మంతపురి రోడ్డు నుంచి రఘునాథపురం రోడ్డు వరకు ఫ్‌లైఓవర్‌ను పరిశీలించారు. స్థానికులతో అధికారులు మాట్లాడారు. వంతెన రోడ్డు మధ్యలో స్టబ్స్‌, స్పీడ్‌ బ్రేకర్లు, సూచిక బోర్డులు, వీధిదీపాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. వారివెంట యాదగిరిగట్టు ట్రాఫిక్‌ సీఐ కృష్ణ, ఆలేరు మున్సిపల్‌ మేనేజర్‌ జగన్‌మోహన్‌, ఎస్‌ఐ వినయ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement