శాంతిభద్రతల పరిరక్షణలో పాలీసుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పరిరక్షణలో పాలీసుల పాత్ర కీలకం

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

భువనగిరి : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకంగాఉంటుందని ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ అన్నారు. శనివారం బీబీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ రవికుమార్‌, ఆత్మకూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు ఏఎస్‌ఐ కేశవరెడ్డిలు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వారిని శాలవాలతో ఘనంగా సన్మానించి మాట్లాడారు. పదవీ విరమణ పొందిన పోలీస్‌ అధికారులు కుటుంబ సభ్యులతో జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

యాదగిరి క్షేత్రంలో శాస్త్రోక్త పూజలు

యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల ఆర్జిత పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం చేపట్టారు. సాయంత్రం వేళ భక్తుల నడుమ జోడు సేవలను మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

జలనారాయణస్వామికి మంగళహారతులు

భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి జలనారాయణ స్వామికి మంగళహారతులు సమర్పించారు. ఆలయంలో స్వామివారికి ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, సహస్ర నామార్చన సేవ, నిత్య కల్యాణం నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి ఉత్సవసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

తుర్కపల్లి : ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ శనివారం ఆయన యాదగిరిగుట్ట పట్టణం నుంచి తుర్కపల్లి వరకు సైకిల్‌ యాత్ర నిర్వహించారు. మాదాపూర్‌, దత్తాయపల్లి, వెంకటాపురం గ్రామాల మీదుగా తుర్కపల్లిలోని ధాన్యం కొనుగొలు కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాన్‌ 2 వరకు ఏ కొనుగోలు కేంద్రంలోనైనా ధాన్యం నిల్వలుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటాపురంలో భగీరథ పైప్‌లైన్‌కు లీకేజీలను గుర్తించి మంత్రి సీతక్కతో ఫోన్‌లో మాట్లాడి మరుమ్మతులకు ఆదేశించాలని కోరా రు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైరపర్సన్‌ ఐనాల చైతన్యమహేందర్‌రెడ్డి, మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుటిపాటి మధుసూదన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌, భాస్కర్‌రెడ్డి, వెంకటేశం, ఐలయ్య, భాస్కర్‌నాయక్‌, నారాయణరెడ్డి, నిఖిల్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement