ఆకట్టుకున్న ‘మాక్‌ పార్లమెంట్‌’ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న ‘మాక్‌ పార్లమెంట్‌’

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

భువనగిరిటౌన్‌ : ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం భువనగిరి కలెక్టరేట్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్నేహ సంఘాల సభ్యులు నిర్వహించిన మాక్‌ పార్లమెంట్‌ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎంపికై న బాలికలు సభాపతి, మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు, ప్రజా ప్రతినిధుల పాత్రలు పోషిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా చూపించారు. పలు విషయాలపై చర్చించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్ల పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా శిశు సంక్షేమ అధికారి నర్సింహారావు, అడిషనల్‌ డీఆర్‌డీఓ సురేష్‌, డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌, ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మందడి ఉపేందర్‌ రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో అంజిరెడ్డి, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement