ఆత్మకూరు(ఎం) : ఆత్మకూరు(ఎం) మండలంలోని ధాన్యం కొనుగోలు
కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు.. ఒకపక్క లారీల కొరత, తరుగు పేరుతో ధాన్యంలో కోతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క గన్నీ సంచులు (బార్‌దాన్) సమస్య వేధిస్తోంది. రహీంఖాన్‌పేటలో మోత్కూరు ఎఫ్‌ఎస్‌సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి శనివార ఉదయం పాత, చిరిగిపోయిన బార్‌దాన్ సంచులు రావడంతో సీరియల్ ఉన్న రైతులు అందులోంచి మంచివి ఏరుకుంటూ ఇలా కనిపించారు.


