పరిశ్రమల్లో కార్మికుల భద్రతే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమల్లో కార్మికుల భద్రతే ముఖ్యం

May 31 2026 2:06 AM | Updated on May 31 2026 2:06 AM

సాక్షి, యాదాద్రి : పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతే ధ్యేయంగా యాజమాన్యాలు, అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. శనివారం భువనగిరి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావుతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి డిస్ట్రిక్ట్‌ క్రైసిస్‌ గ్రూప్‌ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని అన్ని 33 ప్రమాదకర పరిశ్రమలు తమ ఆన్‌సైట్‌ ఎమర్జెన్సీ ప్లాన్‌న్స్‌ను వెంటనే సమర్పించాలన్నారు. నెల రోజుల తర్వాత పరిశ్రమల యాజమాన్యాలతో ప్రత్యేక సమీక్ష సమావేశం ఉంటుందన్నారు. ఫ్యాక్టరీలు, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశ్రమలను సందర్శించి ఇచ్చే నివేదికల ఆధారంగా పరిశ్రమలకు ‘భద్రత, కాలుష్య నియంత్రణ పనితీరు’పై ర్యాంకులు కేటాయిస్తామన్నారు. సమావేశంలో ఫ్యాక్టరీల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కేవీ.శ్రీదేవి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకన్న, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్‌ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement
 
Advertisement
Advertisement