న్యూస్‌రీల్
పింఛన్ పైసలు ఎప్పుడిస్తరు..
చేయూత పింఛన్లు సకాలంలో అందకపోవడంతో యాదగిరిగుట్ట పట్టణంలో లబ్ధిదారులు ధర్నాకు దిగారు.
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
సంస్థాన్‌నారాయణపురం, ఆత్మకూర్(ఎం)లో ప్రమాద ఘంటికలు
- 9లో
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026
విధి నిర్వహణలో అలసత్వం వద్దు : ఎస్పీ
వలిగొండ : విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన వలిగొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని సమీక్షించి గడువులోగా చార్జీషీట్ వేయాలని సూచించారు. స్టేషన్కు వచ్చే బాధితులకు తక్షణమే సహాయం అందించాలన్నారు. పెట్రోలింగ్, ప్రజా ఫిర్యాదులపై సిబ్బంద కి కీలక ఆదేశాలు చేశారు. ఆయన వెంట రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ యుగంధర్, సిబ్బంది ఉన్నారు.
వైభవంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాఢ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు.
స్వర్ణగిరీశుడికి తిరువీధి ఉత్సవసేవ
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం అర్చకులు శ్రీవేంకటేశ్వర స్వామికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుభ్రబాతం, తోమాలు, సహస్ర నామార్చన, పద్మావతి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన సేవలు నిర్వహించి స్వామి వారికి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
సాక్షి, యాదాద్రి : భారీ వర్షాలు కురిసినా.. భూగర్భ జలాలు మాత్రం పాతాళానికి చేరుతున్నాయి. ఇష్టానుసారంగా బోరుబావుల ద్వారా నీటిని తోడేస్తుండటంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని జల సంక్షోభం ముంచుకొస్తోంది. జిల్లాలోని ఆత్మకూర్ (ఎం), సంస్థాన్ నారాయణపురం మండలాల్లో భూగర్భ జలమట్టాలు 11 మీటర్ల లోతుకు పడిపోయినట్లు కేంద్ర ప్రభుత్వ భూగర్భ జల వనరుల మదింపు నివేదిక–2025 వెల్లడించింది.
భారీ వర్షాలు కురిసినా.. ఫలితం శూన్యం
సాధారణంగా వర్షాలు బాగా పడితే భూగర్భ జలాలు పెరుగుతాయని భావిస్తాం. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. గత సంవత్సరం జిల్లాలో 174 శాతం అదనపు వర్షపాతం నమోదైనప్పటికీ, సంస్థాన్‌నారాయణపురం, ఆత్మకూర్(ఎం) మండలాల్లో భూగర్భ జలమట్టాల్లో ఆశించిన మార్పూ రాకపోవడం గమనార్హం. భూగర్భ జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం, సర్వేల్ గ్రామాల్లో జలాలు 24.4 మీటర్ల లోతుకు పడిపోయాయి. ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో 11.98 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో సాధారణంగా ఉండాల్సిన నీటిమట్టం కంటే సగటున 4 మీటర్ల వరకు లోతుకు నీరు పడిపోయింది. మార్చిలో ఉండాల్సిన 4.25 మీటర్ల స్థానంలో 7.73 మీటర్ల లోతుకు నీటిమట్టాలు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అవగాహన పెరిగింది కానీ..
ప్రజల్లో జల సంరక్షణపై అవగాహన పెరిగినా ఆచరణలో లోపాలు కనిపిస్తున్నాయి. నీటిని భూమిలోకి పంపే రిచార్జ్ ప్రక్రియ ఒకవైపు జరుగుతున్నా దానికి రెట్టింపు స్థాయిలో బోరుబావుల ద్వారా నీటినితోడేస్తున్నారు. దీంతో జల సంక్షోభం ఏర్పడుతోంది. సంస్థాన్ నారాయణపురం మండలంలో గుట్టల ప్రాంతం అధికంగా ఉంది. నీటి నిలువ శాతం చాలా వరకు తగ్గిపోయింది.
పర్యావరణంపై ప్రభావం
ప్రతి సంవత్సరం నవంబర్ నాటికి (వర్షాకాలం ముగిశాక) 3 మీటర్లు, మే నాటికి 5 మీటర్ల జలమట్టం స్థిరంగా ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని అధికారుల లెక్కలు చెబుతున్నారు. అయితే నీటిమట్టాలు తగ్గిపోవడంతో అకాల వర్షాలు పడడంతోపాటు ఎండలు మండిపోతాయి. భూమికి కూడా నెలవారీగా అవసరమైన జలం అందకపోతే భూగర్భ వ్యవస్థ దెబ్బతింటుంది.
పర్వతారోహణ ఒక కల. ఎవరెస్ట్ ఎక్కడానికి ఏప్రిల్, మే నెల అనువైనది. పర్వతారోహణకు కనీసం 6 నెలల ముందు నుంచే శిక్షణ తీసుకోవాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, మెట్లు ఎక్కడం వంటివి రోజూ సాధన చేయాలి. వీపుపై 15 నుంచి 20 కిలోల బరువున్న బ్యాగ్‌ని వేసుకుని ఎత్తయిన ప్రదేశాల్లో నడవడం ప్రాక్టీస్ చేయాలి. తీవ్రమైన చలి, శారీరక అలసటను తట్టుకునేలా మానసిక దృఢత్వం సాధించాలి. అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ఉండేలా శిక్షణ పొందాలి. పర్వతం ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలి తగ్గుతుంది. శరీరం ఆ వాతావరణానికి అలవాటు పడటానికి బేస్ క్యాంపుల వద్ద కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్లాలి. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వారంతా తగు జాగ్రత్తలు పాటించాలి.
రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధం కండి : కలెక్టర్
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర అవతరణ వేడుకలకు సిద్ధం కావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భువనగిరిలోని జిల్లా వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి కలెక్టర్ తెలంగాణ అవతరణ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జూన్ 2న జాతీయ పతాకావిష్కరణలో భాగంగా కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. అతిథులకు ఆహ్వాన పత్రాలను అందజేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రముఖులు, మీడియా ప్రతినిధులు తదిరులకు సీటింగ్ గ్యాలరీలను జాగ్రత్తగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రగతి నివేదిక సమగ్రంగా రూపొందించాలన్నారు. అమరవీరుల స్థూపం, స్టేజీ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి క్రిష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ అంజిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శంకరమ్మ, శ్వేతలను సన్మానిస్తున్న మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యే సామేల్, చెవిటి వెంకన్న, పున్న కైలాష్
మోత్కూరు : తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకుంటామని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత, తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు కాసోజు శ్రీకాంతాచారి మాతృమూర్తి శంకరమ్మ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నియామకమైన సందర్భంగా వారికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆధ్వర్యంలో శుక్రవారం మోత్కూరులో సన్మాన సభ నిర్వహించారు. ముందుగా అయిలమ్మ, శ్రీకాంతాచారి చిత్రపటాలకు మంత్రి, ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన తొలి, మలిదశ దశ ఉద్యమాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే పురుడు పోసుకున్నాయన్నారు. కాసోజు శంకరమ్మను బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అవమానిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెతోపాటు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాళ్లుగా నియమించి తగిన గౌరవం ఇచ్చిందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ గద్దర్ బిడ్డకు సైతం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి ఇచ్చి ప్రభుత్వం గౌరవించిందన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత మాట్లాడుతూ మహిళా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానన్నారు. రాష్ట్ర మహిళా కమి షన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకున్నారన్నారు. కళాకారుడు గిద్ద రామనర్సయ్య బృందం ఆటాపాటలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న, జిల్లా అదనపు కలెక్టర్ ఎం.భాస్కర్‌రావు, చౌటుప్పల్ డీఎస్పీ పి.మధుసూదన్‌రెడ్డి, మోత్కూరు మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్నసోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, డీసీసీ ఉపాధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి అవిశెట్టి అవిలుమల్లు, మాజీ డీసీసీ ఉపాధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ పేలపూడి వెంకన్న, జిల్లా నాయకులు గుర్రం లక్ష్మినర్సింహారెడ్డి, పట్టణ అధ్యక్షు జీడు గుండగోని రామచంద్రు గౌడ్, గుండగోని జోజి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఎవరెస్ట్ అధిరోహణలోప్రాణాలు కోల్పోతే..
మృతదేహాలను కిందికి తీసుకురాలేక, అక్కడే వదిలేస్తారు. కృత్రిమ ఆక్సిజన్ సహాయంతో ముందుకు సాగే సాహసకులు బరువును కోల్పోతారు. మైదాన ప్రాంతంలో పది కిలో మీటర్లు పరుగెత్తే వారు ఎవరెస్ట్ మీద ఆయాసంతో కనీసం ఒక్క అడుగు కూడా వేయడానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి శవాలను తీసుకురావడానికి ముందుకు వచ్చే వారు తక్కువగా ఉంటారు. సాధారణ మనిషి బరువు 50 నుంచి 60 కిలోలు ఉంటే, వారి ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర సామగ్రి బరువు మరో 5 నుంచి 10 కిలోలు ఉంటుంది. ఎవరెస్ట్‌పై దారులు చాలా ఇరుగ్గా, లోయలతో ఉంటాయి. అడుగు అటుఇటు పడితే లోయల్లోకి జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ దారుల్లో, ఒక మృతదేహం, లేదా ప్రమాదంలో చిక్కుకున్నవారిని కిందికి తీసుకురావాలంటే ఎంతో రిస్క్. ప్రస్తుతం ఎవరెస్ట్‌పై ఎక్కువ మరణాలు సంభవిస్తున్న ప్రాంతం ‘హిల్లరీ స్టెప్’. ఇక్కడ ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి గానీ, తాడు కిందకి వేసి రక్షించడానికి గానీ వీలుండదు. ఎందుకంటే ఆ ఎత్తులో హెలికాప్టర్ ఎక్కువసేపు ఆగలేదు.
భక్తజన సందోహం
ఫ 11 నుంచి 24 మీటర్ల లోతుల్లోకి పడిపోయిన జలాలు
ఫ పరిమితికి మించి నీటినితోడేస్తుండడమే కారణం
ఫ 2025 భూగర్భ జల నివేదికలో వెల్లడి
మే నెలలో నీటిలోతు ఇలా (మీటర్లలో)
వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో..)
మండలం 2023–24 2024–25
నారాయణపురం 624.2 682.8
ఆత్మకూర్(ఎం) 742.4 993.4
ఫ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్
ఫ మోత్కూరులో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు శంకరమ్మ, శ్వేతలకు సన్మానం


