న్యూస్‌రీల్
జాయతీ రహదారుల వెంట..
తవ్వారు.. వదిలేశారు
ఆత్మకూరు(ఎం) మండలం తుక్కాపురం నుంచి రహీంఖాన్‌పేట వరకు రోడ్డును తవ్వి, కంకర పరిచి వదిలేశారు.
- 9లో
శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026
సాక్షి, యాదాద్రి : వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు ఖరారుపై ఉత్కంఠ నెలకొంది. అధికారులు జిల్లాస్థాయి కమిటీల పర్యవేక్షణలో భూముల విలువ నిర్ధారణపై కసరత్తు కొనసాగుతోంది. జిల్లా స్థాయిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, రిజిస్టార్‌లు, హెచ్‌ఎండీఏ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. విపులంగా చర్చించిన అనంతరం భూముల, ఆస్తుల విలువలను ఖరారు చేయనున్నారు. పలుచోట్ల తప్పులు దొర్లడంతో మరోసారి సవరించిన భూముల విలువలను ఒకటిరెండు రోజుల్లో అమలులోకి తేవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నారు. వీటిని భూ పరిపాలన శాఖ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు సంయుక్తంగా ఆమోదించనున్నాయి.
సవరణ ప్రక్రియపై ఆసక్తి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూములు, ఆస్తుల విలువల పెంపు నిర్ణయం కసరత్తు చర్చనీయాంశంగా మారింది. తమ భూములు, ఆస్తుల విలువలు పెరుగుతాయని జనంలో ఆసక్తి నెలకొంది. జిల్లాలో భూముల విలువల సవరణ ప్రక్రియ ప్రస్తుతం అధికారులు చేపట్టారు. కొన్ని గ్రామాల వివరాలను అధికారులు రీ–అప్‌లోడ్ చేస్తున్నారు. విలువల లెక్కింపు విషయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టారు.
పరిగణనలోకి మార్కెట్ ధరలు
భూభారతి బేస్ రేట్ ఉదాహరణకు ఎకరం రూ.2 లక్షలు ఉంటే, ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ధర రూ.30 లక్షలు పలుకుతోంది. ఇలాంటి చోట మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని దాదాపు వంద శాతం ధరలను పెంచినట్లు విశ్వసనీయ సమాచారం. అంటే దాదాపు రూ.4 లక్షలుగా నిర్ణయించారు.
వ్యవసాయేతర భూములకు ఇలా..
ఇళ్ల స్థలాలు, కమర్షియల్ భూములకు జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) చైర్మన్‌గా ఉన్నారు. తహసీల్దార్‌లు, సబ్‌రిజిస్ట్రార్, మున్సిపాలిటీల్లో కమిషనర్, గ్రామాలు అయితే ఎంపీడీవోలు సభ్యులుగా ఉన్నారు. హెచ్‌ఎండీఏ మండలాల్లో ఆ శాఖ అధికారులు ఉన్నారు.
వ్యవసాయ భూములకు..
వ్యవసాయ భూములకు ఆర్డీవోలు, తహసీల్దార్‌లు, సబ్‌రిజిస్ట్రార్, ఎంపీడీవో, హెచ్‌ఎండీఏ ఽప్రతినిధులు భూముల విలువల పెంపుపై సంతకాలు చేసిన తర్వాత అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే తప్పులు దొర్లుతుండడంతో మళ్లీ తనిఖీలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల ప్రకారం సబ్‌రిజిస్ట్రార్లు అధికారుల బృందం నిర్ణయించిన ఽవిలువలపై క్షేత్రస్థాయిలో రీవెరిఫికేషన్ చేసి తుది ధరలను నిర్ణయిస్తున్నారు.
అధికారికంగా ప్రకటించే వరకు..
అధికారికంగా వెబ్‌సైట్‌లో ప్రకటించే వరకు ఏ భూ మికి ఎంత ధర పెరింగిందన్న సమచారం వెల్లడించడంలేదు. ఎవరికి వారు అంచనాల్లో ఉన్నా రు. కొందరు అధికారులు ఇస్తున్న లీకులతో రేట్లు దాదాపు ఖరారు అయినట్లు ఆయా ప్రాంత ప్రజలు విశ్వసిస్తున్నారు. రెండు మూడు రోజల్లో అధికారికంగా వెబ్‌సైట్లో భూముల విలువల పెంపు వివరాలు ప్రకటిస్తామని అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు.
చివరి గింజ వరకూ కొంటాం
ఏ పనులు చేసుకోలేరు
నోష్ ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులు నేటికీ చికిత్స పొందుతున్నారు.
- 8లో
ఫ ధాన్యం కొనుగోళ్లలో మొదటి స్థానం
ఫ జిల్లా యంత్రాంగం పనితీరుకు అభినందనలు
ఫ సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జిల్లాలో జాతీయ రహదారుల వెంట వ్యవసాయ భూమి ఎకరం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.కోట్లలో పలుకుతుంది. జాతీయ రహదారులు, యాదగిరిగుట్ట అభివృద్ధి, రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న హెచ్‌ఎండీఏ మండలాలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారం, పారిశ్రామిక వాడలతో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు ఆకాశన్నంటాయి. జాతీయ రహదారుల వెంట 25 శాతం ఽపెంపు చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఽగజం ధర రూ.లక్ష వరకు పలుకుతోంది. భువనగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీలు, బీబీనగర్ ఎయిమ్స్, యాదగిరిగుట్ట, రాయగిరి వంటి ప్రాంతాల్లో గజం ధర రూ.50 వేలపైన పలుకుతోంది. ప్రధానంగా హైదరాబాద్–విజయవాడ, హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారుల వెంట భూముల ధరలు రూ.కోట్లలో ఉన్నాయి. అయితే ఇక్కడ మార్కెట్ విలువ ఇప్పటికే రూ.30 లక్షలకుపైగా ఉన్నాయి. 25 శాతం పెంపుతో ధరలు పెరుగనున్నాయి. భూముల రకాన్ని బట్టి జిల్లా స్థాయి కమిటీలు భూముల విలువలు నిర్ణయించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి.
ఫ తప్పులు దొర్లడంతో సవరిస్తున్న అధికారులు
ఫ పెరగనున్న వ్యవసాయ భుములు, ఆస్తుల విలువ
ఫ సాధారణ భూమి ఎకరం ధర వంద శాతం పెంపు
ఫ హైవేల వెంట ఎకరాకు 25 శాతం పెంచే అవకాశం


