బాల్యంలోనే బడిబాట | - | Sakshi
Sakshi News home page

బాల్యంలోనే బడిబాట

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

ఒక్కో పాఠశాలకు రూ.1.50లక్షలు

పాఠశాలల్లో అదనంగా ప్రీప్రైమరీ సెక్షన్లు

రామన్నపేట : చిన్నారులు బ్యాలంలోనే బడిబాట పట్టేలా ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అనుసంధానంగా ప్రీప్రైమరీ సెక్షన్లు ఏర్పా టు చేస్తోంది. దీంట్లో భాగంగా గత విద్యా సంవత్సరం జిల్లాకు 45 స్కూళ్లకు ప్రీప్రైమరీ సెక్షన్లు మంజూరు చేయగా వాటిని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రారంభించారు. తాజాగా 62 ప్రీప్రై మరీ సెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పాఠశా ల విద్యా శాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఈనెల 26న ఉత్తర్వులు జారీ చేశారు. 2026–27 విద్యాసంవత్సరం నుంచే ఈ ప్రీ ప్రైమరీ సెక్షన్లను ప్రారంభించనున్నారు. గతేడాది, ప్రస్తుతం మంజూరైన వాటితో కలిపి జిల్లాలో ప్రీప్రైమరీ స్కూళ్ల సంఖ్య 107కు చేరుకుంది.

ప్రైవేట్‌కు దీటుగా..

ఐదేళ్లు నిండిన పిల్లలనే ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో చేర్చుకుంటారు. అదే ప్రైవేటు పాఠశాలలో మూడేళ్లు నిండగానే ఎల్‌కేజీ, యూకేజీ సెక్షన్లలో చేర్చుకుంని పాఠశాలలకు అలవాటు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు లేకపోవడం వల్ల పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి రూ.వేలకువేలు ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రీప్రైమరీ సెక్షన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించి ఆచరణలో పెట్టింది. గత విద్యా సంవత్సరం జిల్లాకు 45 స్కూళ్లకు ప్రీప్రైమరీ సెక్షన్లు మంజూరు చేయగా కొత్తగా మంజూరైన వాటితో కలిపి వాటి సంఖ్య 107కు చేరింది.

పిల్లల నమోదు పెంచాలని..

చిన్నపిల్లలకు బడి అంటే భయం పోగొట్టి పాఠశాలకు అలవాటు చేయడం, ఇంగ్లిష్‌ మీడియంకు సన్నద్ధం చేయడం ప్రీప్రైమరీ సెక్షన్స్‌ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం. చిన్నపిల్లలను పాఠశాలకు ఆహ్వానించడం, కథలు, పాటలు, ఆటలు ద్వారా ఆకట్టుకుంటూ యూకేజీ విద్యను అందించనున్నారు. ప్రభుత్వం ప్రీ ప్రైమరీ సెక్షన్‌ నిర్వహణకు అదనంగా ఇంటర్‌ టీటీసీ కనీస విద్యార్హత కలిగిన ఇన్‌స్ట్రక్టర్‌తో పాటు, ఆయాను నియమిస్తారు. విద్యార్హత ప్రతిభ ఆధారంగా జిల్లా సెలక్షన్‌ కమిటీ వీరిని నియమిస్తుంది. ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేల వేతనం ఇవ్వనున్నారు.

ప్రీప్రైమరీ సెక్షన్‌ మంజూరైన ఒక్కో పాఠశాలకు ప్రభుత్వం రూ.1.50లక్షలు మంజూరు అవుతాయి. ఆ నిధులతో ప్రీప్రైమరీకి కేటాయించిన గదిని చిన్నారులకు కావాలిసన వివిధ రకాల బొమ్మలతో కూడిన పేయింటింగ్‌ వేయిస్తారు. పిల్లలు కూర్చోవడానికి అనువైన ఇరవై కుర్చీలు, ఐదు గ్రూప్‌ టేబుల్స్‌, టీచర్‌ చైర్‌, టేబుల్‌, రెండు లేదా మూడు ఓపెన్‌ ర్యాక్స్‌, ప్లే మెటీరియల్‌ బిన్స్‌, బ్లాక్‌బోర్డు, చిన్నారులకు అవసరమైన ఆట వస్తువులను, పడుకోవడానికి అనువైన బెడ్లను సమకూరుస్తారు.

ఫ ఈ విద్యాసంవత్సరానికి 62 మంజూరు

ఫ జూన్‌లోనే ప్రారంభానికి సిద్ధం

ఫ గత ఏడాదిదే మంజూరైనవి 45

ఫ ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రీప్రైమరీ సెక్షన్లు

Advertisement
 
Advertisement
Advertisement