ఫకొనుగోళ్లలో జాప్యానికి నిరసన
ఆలేరురూరల్ : ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా తెలంగాణ రక్షణ సేన పార్టీ (టీఆర్‌ఎస్) ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి మణిపాల్‌రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని ఖండిస్తూ గురువారం ఆలేరు కొలనుపాక ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి కాళ్లుకు చెప్పులు లేకుండా దాదాపు 8 కిలోమీటర్ల మేర తోపుడు బండిపై ధాన్యం బస్తాలు వేసుకొని ఆలేరు మార్కెట్ యార్డు వరకు బండిని తోచుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు విషయం తెలుసుకొని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే నిరసన కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పారు.
శాసీ్త్రయ ఆలోచనతోనే కార్మికులకు విముక్తి
భువనగిరిటౌన్ : శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకున్నప్పుడే కార్మిక వర్గ విముక్తి, హక్కుల సాధన సాధ్యమవుతుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ అన్నారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, జిల్లా ఆఫీస్ బేరర్లు దాసరి పాండు, మాయ కష్ణ, తుర్కపల్లి సురేందర్, గొరిగే సోములు, సిలివేరు రామకుమారి, చెక్క రమేష్, పొట్ట యాదమ్మ, నకిరేకంటి రాము, పైళ్ల గణపతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు నందీశ్వర్, మాతయ్య, శ్రీరాములు, లలిత, జహంగీర్, మధు, సురేందర్ పాల్గొన్నారు.
స్వర్ణగిరీశుడికి తిరుప్పావడ సేవ
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గురువారం శ్రీవేంకటేశ్వరస్వామికి తిరుప్పావడ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి 450 కిలోల అన్నప్రసాదం నైవేద్యంగా సమర్పించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, తోమాలసేవ, సహస్రనామార్చన సేవ, సుదర్శన నారసింహ హవనం, నిత్యకల్యాణం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు.


