సాగర్‌ను సందర్శించిన జీఆర్‌ఎంబీ చైర్మన్‌ | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ను సందర్శించిన జీఆర్‌ఎంబీ చైర్మన్‌

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

నాగార్జునసాగర్‌ : గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్‌ పద్మదోర్జి గంబే గురువారం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సాగునీటి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నాగార్జునసాగర్‌ ప్రధాన డ్యాం, క్రస్ట్‌గేట్లు, రైట్‌ కెనాల్‌ హెడ్‌రెగ్యులేటర్‌, స్పిల్‌వే, గ్యాలరీలు, ప్రధాన జల విద్యుదుత్పాదన కేంద్రాన్ని సందర్శించారు. విద్యదుత్పాదన కేంఽద్రం పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి మ్యూజియాన్ని సందర్శించారు. సాధారణ పర్యటకు వచ్చిన ఆయనకు విజయ విహార్‌ వద్ద సాగర్‌ డ్యాం ఎస్‌ఈ మల్లికార్జున్‌రావు, ఆంధ్రా ఎస్‌ఈ వెంకటరత్నం ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట జీఆర్‌ఎంబీ కార్యదర్శి అఖిలేష్‌కుమార్‌జా, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వేణుగోపాల్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement