అర్వపల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బిగ్‌హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వాలీబాల్‌లో శిక్షణ ఇస్తున్నాం. పిల్లల నుంచి మంచి స్పందన వస్తోంది. శిక్షణ సందర్భంగా బాలబాలికలకు తగిన మెలకువలు నేర్పుతున్నాం.
– మల్లేష్, పీడీ, అర్వపల్లి జెడ్పీహెచ్‌ఎస్
అర్వపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం సందర్భంగా వాలీబాల్ శిక్షణ శిబిరం ఎంతో బాగుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతిరోజు పిల్లలు వచ్చి వాలీబాల్ లో శిక్షణ పొందుతున్నారు. ఎండల్లో తిరగకుండా ఈ శిక్షణ ఉపయోగకరంగా ఉంది.
– ఈద కోటిప్రసాద్, క్రీడాకారుడు అర్వపల్లి


