అర్వపల్లి: వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. విద్యార్థులు బంధువుల ఇళ్లకు వెళ్లడమో, లేదా రోజంతా సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేయడమో చేస్తుంటారు. కానీ, వారిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, వారిని క్రీడల వైపు మళ్లించేలా జిల్లా యువజన క్రీడాభివృద్ధి సంస్థ ఈ వేసవిలో ప్రత్యేక వాలీబాల్ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి జెడ్పీహెచ్‌ఎస్, తుంగతుర్తి మండలంలోని అన్నారం, వెలుగుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఎంపికచేసి ఈ పాఠశాలల్లో 14 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలబాలికలకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు.
28 రోజులుగా కొనసాగుతున్న శిక్షణ
ఆయా పాఠశాలల్లో జిల్లా యువజన క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 1న వాలీబాల్ శిక్షణ ప్రారంభమైంది. జూన్ 5 వరకు మొత్తం 35 రోజులపాటు ఈ శిక్షణ జరగనుంది. ఆయా పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు(పీడీ) విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. మండల కేంద్రాలతో పాటు చ్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఉదయం, సాయంత్రం వేళల్లో శిబిరాలకు వచ్చి వాలీబాల్ ఆడుతున్నారు. అర్వపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో జరుగుతున్న శిక్షణకు బిగ్‌హెల్ప్ అనే స్వచ్ఛంద సంస్థ తమ వంతు సహకారాన్ని అందిస్తోంది. ఒక్కో శిబిరానికి ప్రతి రోజు 50 మందికి పైగానే బాలబాలికలు హాజరవుతున్నారు.
ఇంటి నీడలో కాలక్షేపం
యాదగిరిగుట్ట: వేసవి సెలవుల్లో చిన్నారులు ఎక్కువగా బయట ఎండకు ఆటలు ఆడుతూ కనిపిస్తుంటారు. కానీ యాదగిరిగుట్టలో ఇంట్లోనే నీడ పట్టున ఉంటూ ఆటలు ఆడితే శ్రేయస్కరమని భావించి పలువురు చిన్నారులు క్యారమ్స్ ఆడుతూ ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు.
ఫ మూడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్సాహంగా సాగుతున్న
వేసవి శిబిరాలు
ఫ 28 రోజులుగా ఆటలో మెలకువలు నేర్చుకుంటున్న విద్యార్థులు


