రహదారి విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ | - | Sakshi
Sakshi News home page

రహదారి విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌

May 28 2026 3:10 AM | Updated on May 28 2026 3:10 AM

భువనగిరిటౌన్‌ : భువనగిరి పట్టణ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలకు త్వరలోనే విముక్తి లభించనుంది. ము న్సిపల్‌ పరిధిలోని ప్రధాన రహదారి విస్తరణ పనులకు మున్సిపల్‌ కౌన్సిల్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీ వాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రోడ్డు విస్తరణపై నిర్ణయం తీసుకున్నారు.

ట్రాఫిక్‌ ఇబ్బందులు, ప్రమాదాల నివారణకే..

స్థానిక నల్లగొండ చౌరస్తా నుంచి హైదరాబాద్‌ చౌరస్తా వరకు ఉన్న 60 ఫీట్ల రోడ్డు ప్రస్తుతం ఉన్న వాహనాల రద్దీకి అనుగుణంగా లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడుతున్నాయి. రోడ్డు ఇరుకుగా మారడం వల్ల వాహనదారులు, కాలినడకన వెళ్లే పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కౌన్సిల్‌ దష్టికి తెచ్చారు. పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రహదారిని విస్తరించాలని కౌన్సిల్‌ నిర్ణయించింది.

రెండు విడతల్లో పనులు..

ఈ విస్తరణ పనులను ప్రజల సౌకర్యార్థం, వేగంగా పూర్తి చేసేందుకు వీలుగా రెండు విడతలుగా చేపట్టాలని తీర్మానించారు. మొదటి విడత కింద నల్లగొండ చౌరస్తా నుంచి ఎల్‌.బి. నగర్‌ చౌరస్తా వరకు పనులు చేపడతారు. రెండవ విడత కింద ఎల్‌.బి. నగర్‌ చౌరస్తా నుంచి హైదరాబాద్‌ చౌరస్తా వరకు విస్తరణ పనులు జరుగుతాయి.ఈ మేరకు అధికారులు కౌన్సిల్‌ ముందు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పోతంశెట్టి మంజుల, కమిషనర్‌ కె. చంద్రప్రకాశ్‌రెడ్డి, మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫ భువనగిరి పట్టణంలోని నల్లగొండ చౌరస్తా నుంచి హైదరాబాద్‌ చౌరస్తా వరకు 60 ఫీట్ల రోడ్డు

ఫ రెండు విడతల్లో పనులు.. మున్సిపల్‌ అత్యవసర సమావేశంలో నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement