యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడికి లక్ష పుష్పార్చన

May 28 2026 3:10 AM | Updated on May 28 2026 3:10 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం ఏకాదశి కావడంతో ఆలయాన్ని వేకువజామునే తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాత సేవను జరిపించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు నిజాభిషేకం చేపట్టి, ఆరాధన, బాలబోగం వంటి పూజలను నిర్వహించారు. అనంతరం ముఖ మండపంలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన పూజను చేపట్టారు. ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవమూర్తులను అలంకరించి, వివిధ సుగ్రంధ పరిమళాలు వెదజల్లే పుష్పాలు, తులసీ దళాలతో శ్రీస్వామి వారికి లక్ష పుష్పాలతో అలంకరించారు. అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులు, అధికారులు, సిబ్బందికి పుష్పాలను అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement