యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై వర్తక సంఘాన్ని రద్దు చేయాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. వర్తక సంఘాన్ని రద్దు చేసి, టెండర్లు వేయాలని కోరుతూ బుధవారం యాదగిరిగుట్ట పట్టణ యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడారు. వర్తక సంఘాన్ని రద్దు చేయాలని నెలరోజులుగా పోరాటం చేస్తుంటే అధికారులు స్పందించడం లేదన్నారు. ఈ ధర్నాకు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మద్దతు పలికారు. ఇందులో యాదాద్రి పరిరక్షణ కమిటీ నాయకులు కాటబత్తిని ఆంజనేయులు, పల్లపు బాలయ్య, బండ రామస్వామి, దేవపూజ అశోక్, బుగ్గా ఆంజనేయులు, కొన్నె సంజీవ, బండి అనిల్, ముక్కెర్ల వెంకటేష్, నర్సింహ, కర్రె ప్రవీణ్, మాటూరి బాలయ్య, మిర్యాల క్రిష్ణ, పల్లపు రవి, ధార నవీన్, దొమ్మాట ప్రభాకర్, మందోజ్ నరేష్, వాల్మీకి అజయ్, సుధాగాని శివ, మెరుగు వెంకటేష్, కర్రె శ్యామ్, లక్ష్మయ్య, గుండు కుమార్, లింగాల వెంకటేష్, నరేష్, కాంటెకర్ శ్రవణ్, నాగేందర్ రెడ్డి, గడ్డమీది శ్రీకాంత్, శ్రీనాథ్, రమేష్, గణేష్, సంతోష్ పాల్గొన్నారు.


