ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల అరిగోస | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల అరిగోస

May 27 2026 10:26 AM | Updated on May 27 2026 10:26 AM

ఆలేరురూరల్‌: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద అరిగోస పడుతున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతు గోస–బీజేపీ భరోసా బస్సు యాత్రలో భాగంగా ఆలేరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లోగల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభా పక్ష ఉపనేత పాయల్‌ శంకర్‌, ఎమ్మెల్యేలు ధన్పాల్‌ సింగ్‌, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎంపీ కోడెం నగేష్‌తో కలిసి ఆయన పరిశీలించారు. రైతులను అడిగి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు బంద్‌ చేసి ధాన్యం తరలించేందుకు లారీ ట్రిప్పులు పెంచాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతమ్‌రావు, అశోక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి సురేష్‌, జగన్మోహన్‌రెడ్డి, మరళీధర్‌రెడ్డి, దాసరి మురళి, వట్టిపల్లి శ్రీనివాస్‌, కాదూరి అచ్చయ్య పాల్గొన్నారు.

తప్పుడు లెక్కలు చెబుతున్న సీఎం

భువనగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.రైతు గోస–బీజేపీ భరోసా బస్‌ యాత్ర మంగళవారం భువనగిరి మండలంలోని వడపర్తికి చేరుకుంది. ఈసందర్భంగా ధాన్యాన్ని పరిశీంచిన తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇప్పటి వరకు 80 శాతం ధాన్యం కొనుగోలు చేశామని సీఎం చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. బీజేపీ అధ్యక్షుడు అశోక్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ గోదాం నగేష్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, సూర్యనారాయణగుప్తా, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, బూర నర్సయ్యగౌడ్‌, కాసం వెంకటేశ్వర్లు, వేముల అశోక్‌, గౌతమ్‌ రావు, శ్రీనివాస్‌, పడమటి జగన్మోహన్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, మాయ దశరథ, ఏలె చంద్రశేఖర్‌, పాశం భాస్కర్‌, పట్నం శ్రీనివాస్‌, శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement