రోడ్డు పనులు పూర్తి చేయాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

రోడ్డు పనులు పూర్తి చేయాలని రాస్తారోకో

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

మోత్కూరు : మోత్కూరు నుంచి రాజన్నగూడెం వరకు అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శనివారం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్‌ మాట్లాడుతూ రహదారి పనులు అసంపూర్తిగా నిలిచి పోవడంతో రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చొరవ తీసుకొని రోడ్డు పనులు పూర్తి చేయించి మోత్కూరు నుంచి భువనగిరి రూట్‌లో నడిచే బస్సులను రాజన్నగూడెం స్టేజీ వద్ద ఆపాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్‌ కార్యక్రమంలో జిల్లా నాయకుడు జిట్టా గౌతమ్‌ ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు చిప్పలపల్లి నవీన్‌, సువ్వి, కరుణాకర్‌, రవి మహవీర్‌, కొంగరి నవదీప్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement