టిప్పర్‌ను ఢీకొని దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ను ఢీకొని దుర్మరణం

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

బొమ్మలరామారం : బైక్‌పై వెళ్తున్న యువకుడు టిప్పర్‌ను ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన బొమ్మలరామారం మండలం రంగాపూర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన బూడిద నవీన్‌(33) మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా రాంపల్లిలోని మారుతీ షోరూంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా రంగాపూర్‌ చెక్‌పోస్ట్‌ వద్ద మెయిన్‌రోడ్డు మధ్యలో నిలిపి ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయడిన నవీన్‌ను పోలీసులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. టిప్పర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఆరు నెలల కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement