సూర్యాపేట : అక్షర ఫౌండేషన్–సూర్యాపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్న విద్యార్థుల ఇండస్ట్రీయల్ టూర్‌ను శనివారం సుధాకర్ పీవీసీ ప్రొడక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్, అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస రాంకుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ టూర్‌లో భాగంగా ఒక పరిశ్రమకు ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తుంది, వస్తువు ఎలా తయారవుతుంది అని క్షుణ్ణంగా తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పు నాగయ్య, రుద్రంగి కాళిదాసు, సీనియర్ అకౌంటెంట్ శర్మ, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ మూర్తి, మర్రి ప్రియాంక, యాస శృతి, సొల్లేటి ఉపేంద్రాచారి, తుంగతుర్తి జనార్దనాచారి, కె. హరిత, ఉప్పు సంధ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
మేము బొమ్మలు గీశామోచ్..


