ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు శనివారం వెలువడిన పాలిసెట్ ఫలితాల్లో స్టేట్ మొదటి ర్యాంకులతో పాటు అత్యుత్తమ
ర్యాంకులు సాధించారు.
‘జయ’ విద్యార్థులకు స్టేట్ ఫస్ట్ ర్యాంకు
సూర్యాపేటటౌన్ : పాలిసెట్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. పాఠశాలకు చెందిన బాణోతు హేమంత్, చిలక నందవర్ధన్‌రెడ్డి ఎంపీసీ విభాగంలో 120 మార్కులకు 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 1వ ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్, డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు.
నల్లగొండ విద్యార్థికి మొదటి ర్యాంకు
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణానికి చెందిన జంగాల అవినాష్ అంగద్ శనివారం వెలువడిన పాలిసెట్ – 2026 ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. నల్లగొండ పట్టణంలోని గోకుల్ కాలనీకి చెందిన జంగాల లింగస్వామి, అనూష దంపతుల కుమారుడు అవినాష్ నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో పదో తరగతి చదివి 585 మార్కులు పొందాడు. పాలిసెట్ ఎంపీసీ స్ట్రీమ్‌లో 120 మార్కులకు గాను 120 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఎంబైపీపీ స్ట్రీమ్‌లో 120 మార్కులకు 118 మార్కులతో రాష్ట్రస్థాయిలో 13వ ర్యాంకు సాధించాడు.
స్టేట్ 3వ ర్యాంకు
సూర్యాపేటటౌన్ : పాలిసెట్ ఫలితాల్లో సూర్యాపేట పట్టణంలోని సృజన పాఠశాలకు చెందిన హేమంత్‌రెడ్డి 120 మార్కులకు 119.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా హేమంత్‌రెడ్డిని శనివారం పాఠశాల యాజమాన్యం అభినందించారు.
పాలెం విద్యార్థినికి 13వ ర్యాంకు..
నకిరేకల్ : మండలంలోని పాలెం గ్రామానికి చెందిన మోదాల ఆరాధ్య పాలిసెట్ ఫలితాల్లో ఎంబైపీసీ విభాగంలో 120 మార్కులకు గాను 117.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 16వ ర్యాంకు సాధించింది. ఎంపీసీ విభాగంలో 120 మార్కులకు గాను 118 మార్కులతో రాష్ట్రస్థాయిలో 43వ ర్యాంకు సాధించింది. ఆరాధ్య సూర్యాపేటలోని జయ హైస్కుల్‌లో పదో తరగతి చదివి 585 మార్కులు సాధించింది.
17వ ర్యాంకు సాధించిన కౌశిక్ సాయి
చిలుకూరు : పాలిసెట్ ఫలితాల్లో చిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం–రాధిక దంపతుల కుమారుడు కౌశిక్ సాయి ఎంపీసీ విభాగంలో 120 మార్కులకు గాను 119 సాధించి రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంకు సాధించాడు. ఎంబైపీసీలో 120 మార్కులకు 115 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 91 ర్యాంకు సాధించాడు.
చిలక నందవర్ధన్‌రెడ్డి
బానోత్ హేమంత్


