యాదగిరిగుట్టకు చేరుకున్న విజయేంద్ర సరస్వతి స్వామిజీ | - | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టకు చేరుకున్న విజయేంద్ర సరస్వతి స్వామిజీ

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలోని టెంపుల్‌ సిటీపై నిర్మించనున్న వేద పాఠశాలకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన పూజలు నిర్వహించనున్న నేపథ్యంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ శుక్రవారం ఆలయానికి చేరుకున్నారు. పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద ఈఓ భవాని శంకర్‌, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, తహసీల్దార్‌ గణేష్‌ నాయక్‌లు స్వాగతం పలికారు. కొండపైకి చేరుకున్న స్వామిజీకి దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం ఈఓ కార్యాలయంలో సంప్రోక్షణ పూజలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement