వడ్లు తూకం వేసేందుకు లంచం తీసుకుంటున్నారు | - | Sakshi
Sakshi News home page

వడ్లు తూకం వేసేందుకు లంచం తీసుకుంటున్నారు

May 22 2026 5:40 AM | Updated on May 22 2026 5:40 AM

వడ్లు తూకం వేసేందుకు లంచం తీసుకుంటున్నారు ఇష్టానుసారంగా కాంటాలు వేశారు

ధాన్యం కొనుగోళ్లలో సీరియల్‌ పాటించడంలేదు. మాయిశ్చర్‌ తీయకున్నా కాంటాలు వేస్తున్నారు. ఏఈఓ ఆపమని చెప్పినా గుట్టుగా తూకం వేసి ఎగుమతి చేస్తున్నారు. తూకాలు వేసేందుకు లంచాలు తీసుకుంటున్నారు. లంచం ఇస్తేనే ధాన్యం తూకం అవుతుంది. ఉదయం ఇవ్వాల్సిన గన్నీ బ్యాగులు సాయంత్రం ఇస్తున్నారు. వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి.

– కొంతం ప్రతాపరెడ్డి, రైతు, చిన్నకొండూరు

తాను మాయిశ్చర్‌ తీయని ధాన్యం కుప్పలు సైతం ఇష్టానుసారంగా కాంటా వేసి ఎగుమతి చేశారు. మాయిశ్చర్‌ రాలేదు, ఆపమని చెప్పిన కుప్పలకు సైతం కాంటా వేశారు. నా ప్రమేయం లేకుండానే ధాన్యం కుప్పలకు కాంటా వేసినట్టు గుర్తించాను. గురువారం రైతుల సమక్షంలో విషయం వెలుగుచూసింది. బుక్‌కీపర్‌ ఎలాంటి సమాధానం చెప్పకుండానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.

– శ్రావ్య, ఏఈఓ, చౌటుప్పల్‌.

Advertisement
 
Advertisement
Advertisement