భువనగిరి (బీబీనగర్) : పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం బీబీనగర్ మండల కేంద్రంతో పాటు కొండమడుగు గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీబీనగర్‌లో ఆయన మాట్లాడుతూ ఇళ్లలో అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. అర్హులైన వారిని నిష్పక్షపాతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అదికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ అలివేలు, శ్రీరాములు, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ శ్యాంసుదర్‌రెడ్డి, ఏఈఈలు రాకేష్‌కుమార్, రవికిరణ్, సునీల్, మనోహర్‌రెడ్డి, గీత, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


