బదిలీల ప్రక్రియ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బదిలీల ప్రక్రియ ప్రారంభం

May 22 2026 5:40 AM | Updated on May 22 2026 5:40 AM

సాక్షి, యాదాద్రి : ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. తొలిరోజు ట్రెజరీ, మార్కెటింగ్‌, పశు సంవర్ధక శాఖ, జిల్లా పరిషత్‌, విద్యాశాఖ, ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల ఉద్యోగుల బదిలీలు కౌన్సెలింగ్‌ ద్వారా జరి గాయి. గ్రేడ్‌–1, 2, 3 పంచాయతీ సెక్రటరీల బదిలీలు శుక్రవారం రాష్ట్రస్థాయిలో జరుగుతాయి. గ్రేడ్‌–4 బదీలీలు జిల్లా స్థాయిలో జరుగుతాయి. రెవెన్యూ శాఖ బదిలీలు 23న మధ్యాహ్నం సీఎం పర్యటన అనంతరం చేపడతారు. కాగా తొలిరోజు జరిగిన బదిలీల్లో జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డ్‌ అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement