ఇంధన ధరలు పెంచడం సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఇంధన ధరలు పెంచడం సరికాదు

May 22 2026 5:40 AM | Updated on May 22 2026 5:40 AM

మోటకొండూర్‌ : కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచినందుకు నిరసనగా ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట టెంపుల్‌ నుంచి మోటకొండూర్‌ వరకు గురువారం సైకిల్‌ యాత్ర నిర్వహించారు. మార్గ మధ్యలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న తహసీల్దార్‌ ఎంపీడీఓ కార్యాలయాలను పరిశీలించి నాణ్యతతో పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌లను ఆదేశించారు. స్థానికంగా అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజీవ్‌గాంధీ వర్ధతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చమురు ధరల పెంపునకు నిరసనగా తన కాన్వాయ్‌ని, పెట్రోల్‌ డీజిల్‌ వాహనాలను నెలరోజుల పాటు వాడబోనని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో రెండు దఫాలు 2034 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని ఆలేరులో మళ్లీ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఈరసరపు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మోహన్‌రెడ్డి, పచ్చిమట్ల మదార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు గంగపురం మల్లేష్‌, భాస్కరుణి రఘునాథరాజు, నెమ్మాని సుబ్రమణ్యం, పేరబోయిన దివ్య మకర జ్యోతి కార్తీక్‌, పసల ప్రదీప్‌, పచ్చిమట్ల జయమ్మ, బుడిగె బాలరాజు గౌడ్‌, ఆకుల శ్రీనివాస్‌ ముదిరాజ్‌, బోయిని ఝాన్సీ, వంగపల్లి మహేందర్‌, అశోక్‌, కొమురయ్య, బాల్ధ మధు పాల్గొన్నారు.

ఫ నిరసనగా గుట్ట నుంచి మోటకొండూరు వరకు బీర్ల ఐలయ్య సైకిల్‌ యాత్ర

Advertisement
 
Advertisement
Advertisement