దేవాదాయశాఖ కమిషనరేట్‌ ఎదుట నిరసన | - | Sakshi
Sakshi News home page

దేవాదాయశాఖ కమిషనరేట్‌ ఎదుట నిరసన

May 22 2026 5:40 AM | Updated on May 22 2026 5:40 AM

యాదగిరి క్షేత్రంపై వర్తక సంఘం

దుకాణాలను రద్దు చేయాలని డిమాండ్‌

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన వర్తక సంఘం దుకాణాలను రద్దు చేసి, టెండర్లు వేయాలని యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన అన్నల్దాస్‌ వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. కొండపైన వర్తక సంఘం పేరుతో కొనసాగుతున్న తాత్కాలిక దుకాణాల టెండర్‌ గడువు ముగిసినప్పటికీ మళ్లీ టెండర్లు నిర్వహించకుండా దేవస్థానం అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. వర్తక సంఘం పేరిట దుకాణాలను పెంచుతూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement