వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఎండ అధికంగా ఉంటుంది.

- 8లో

చిలుకు స్వామికి

శ్రమ శక్తి అవార్డు

ఆలేరురూరల్‌: ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన డాక్టర్‌ చిలుకు స్వామి శ్రమ శక్తి అవార్డుకు ఎంపికయ్యారు. 14 సంవత్సరాలుగా సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ పలు సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. సికింద్రాబాద్‌ డివిజినల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌సీఆర్‌ఈసీసీఎస్‌) ప్రెసిడెంట్‌గా 42 వేల మంది రైల్వే కార్మికులకు సేవలు అందిస్తున్నారు. కార్మికుల దినోత్సవం మేడేను పురష్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ ల చేతుల మీదుగా శ్రమ శక్తి అవార్డును హైదరాబాద్‌ రవీంద్రా భారతిలో అందుకోనున్నారు. గ్రామ ప్రజలు కంతి మహేందర్‌, రచ్చ రామ్‌నర్సయ్య, వెంకటేష్‌, గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement