నేతన్న భరోసా నిధులు జమ | - | Sakshi
Sakshi News home page

నేతన్న భరోసా నిధులు జమ

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

భూదాన్‌పోచంపల్లి: నేతన్న భరోసా పథకం కింద మొదటి మూడు నెలలకు గాను జిల్లాలోని 10,752 మంది చేనేత కార్మికుల ఖాతాల్లో రూ. 3,29,16,000లను జమ చేయనున్నట్లు జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం పోచంపల్లి మండలానికి నేతన్న భరోసా కింద మంజూరైన చెక్కులను కెనరాబ్యాంకు, ఎస్‌బీఐ, తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకు మేనేజర్లకు అందజేసి మాట్లాడారు. పోచంపల్లి మండలంలో 3059 మంది చేనేత కార్మికులు, అనుబంధ కార్మికులకు కలిపి రూ.94,30,500లను వారి ఖాతాలో జమ చేశామని చెప్పారు. ఇందులో మగ్గం నేసే కార్మికుడికి రూ.4500, అనుబంధ కార్మికుడికి రూ.1500 చొప్పున ఖాతాలో జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తడక వెంకటేశ్వర్లు, ఏడీఓ అఖిల్‌రెడ్డి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, చేనేత సహకార సంఘం డైరెక్టర్‌ గంజి అంజయ్య, మేనేజర్‌ రుద్ర అంజనేయులు, ఏలే శ్రీనివాస్‌, ఆటిపాముల మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి

రాజాపేట : రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టిపెట్టాలని, లేకుంటే రానున్న రోజుల్లో మానవ మనుగడ కష్టంగా మారుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం రాజాపేటలోని రైతువేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సేంద్రియ పద్ధతిలో మునగ సాగు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. ఆసక్తిగల రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో సేంద్రియ సాగుచేస్తున్న రైతు ఠాకూర్‌ స్వరణ్‌పాల్‌ సింగ్‌ వ్యవసాయ క్షేత్రాన్ని డీఏఓ సందర్శించారు. సాగు విధానాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి పద్మావతి, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు ఉన్నారు.

రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దు

యాదగిరిగుట్ట(తుర్కపల్లి): రైతులు.. దళారులకు ధాన్యం అమ్ముకోవద్దని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య సూచించారు.మంగళవారం తుర్కపల్లి మండలం గంధమల్లలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు శంకుస్థానన, వీరారెడ్డిపల్లి, తిరుమలాపూర్‌, తుర్కపల్లి, ముల్కపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.అనంతరం దయ్యంబండ తండాలో నిర్వహించిన గ్రామదేవతల పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ చైతన్యరెడ్డి, వ్యవసాయాధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఆర్‌టీఎం నియామకానికి దరఖాస్తులు

నల్లగొండ : నల్లగొండలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో రీజనల్‌ ట్రైనింగ్‌ మేనేజర్‌ (ఆర్‌టీఎం) తాత్కాలిక ప్రాతిపదికన (ఒక సంవత్సరం) నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఆర్డీఓ, పీడీ, డీఆర్‌డీఓ, డీడీ కేడర్లలో సేవలందించి పదవి విరమణ పొందిన, జిల్లాలో స్థిర నివాసం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 29, 30 తేదీల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement