భూదాన్‌పోచంపల్లి: వైద్య శిబిరాల ద్వారా చేనేత కార్మికుల హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం పోచంపల్లిలోని చేనేత డై హౌస్‌లో చేనేత కార్మికులకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. వారికి అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికులు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకొనేందుకు హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుందన్నారు. దానికి అనుగుణంగా భవిష్యత్తులో వైద్యం అందించే అవకాశం ఉంటుందన్నారు. మోబైల్ ఎక్స్‌రే ఏర్పాటు చేసుకొని ఎముకల పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కాగా చేనేత కార్మికులకు గతంలో లాంబార్డ్ హెల్త్‌కార్డులు ఉండేవని తిరిగి హెల్త్‌కార్డులను పునరుద్ధరించాలని చేనేత కార్మికులు కోరారు. అదేవిధంగా మున్సిపాలిటీలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టర్ పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రోజూవారీ ఓపీ, రోగులకు అందిస్తున్నసేవలు, అందుబాటులో ఉన్న మందులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవనం పై కప్పు పెచ్చులూడుతున్నందున మరమ్మతులకు ఎస్టిమేషన్ వేయాలని పీఆర్ ఏఈ జగపతిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, జిల్లా చేనేత జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు, డీఎంహెచ్‌ఓ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యశోదా, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్, హెల్త్‌క్యాంప్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుమన్ కల్యాణ్, వైద్యాధికారిణి శ్రీవాణి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు పాండు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


