మోత్కూరు: ఇళ్ల గణనలో పొరపాట్లకు తావివ్వొద్దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎ.భాస్కర్‌రావు సూచించారు. మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వీయ గణనపై మంగళవారం నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు.ఇళ్ల గణనను సరైన విధంగా పూర్తి చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రణాళికలు రూపు దిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జన గణన కీలక పాత్ర ఉంటుందన్నారు. మే 11 నుంచి ప్రారంభమయ్యే తదుపరి దశ కార్యక్రమానికి ఉపాధ్యాయులందరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్నట్లయితే అవగాహన కల్పించి ప్రభుత్వ బడిలో చేర్పించే బాధ్యతలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి.జ్యోతి, ఎంపీడీఓ డి.బాలాజీ, మున్సిపల్ కమిషనర్ కె.సతీష్‌కుమార్, మాస్టర్ ట్రైనర్లు పసునూరి సుధాకర్, మల్లేషం, ఉపాధ్యాయులు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. హాజరు రిజిష్టర్ పరిశీలించగా జూనియర్ అసిస్టెంట్ షకీల్ సెలవు పెట్టకుండా ఆసుపత్రికి రాక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. ఇద్దరు ఉద్యోగులు సెలవు పెట్టినప్పటికీ రిజిష్టర్లలో సీఎల్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్ వీణ, ఎంపీడీఓ బాలాజీ, ల్యాబ్ టెక్నీషియన్ జనార్దన్, సిబ్బంది మధు, పరమేశ్వరి పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు


