ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

Apr 29 2026 7:12 AM | Updated on Apr 29 2026 7:12 AM

ముగ్గురి అరెస్ట్‌

కట్టంగూర్‌ : నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురిని కట్టంగూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం సీఐ కొండల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్‌ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన కన్యబోయిన మంజుల కట్టంగూర్‌ పీహెచ్‌సీలో కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంగా పనిచేస్తోంది. తనకు పర్మినెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని సికింద్రాబాద్‌కు చెందిన బత్తుల ఉదయ్‌చందర్‌రెడ్డి, శాలిగౌరారం మండలానికి చెందిన కోనమ్‌ రామకుమారి, నకిరేకల్‌కు చెందిన గుండ్లపల్లి సుప్రియ, ఏపీలోని విజయవాడకు చెందిన గౌతమ్‌రెడ్డి, జగిత్యాల జిల్లాకు చెందిన పగడాల మమత డబ్బులు తీసుకుని మోసం చేశారని మంజుల కట్టంగూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఐదుగురు వ్యక్తులు కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురి నుంచి దాదాపు రూ.12లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు బత్తుల ఉదయ్‌చందర్‌రెడ్డి, కోనమ్‌ రామకుమారి, గుండ్లపల్లి సుప్రియను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. గౌతమ్‌రెడ్డి, పగడాల మమత పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement