రామగిరి(నల్లగొండ) : బీసీ కుల గణనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నల్లగొండలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జన గణనలో భాగంగా బీసీ కుల గణన కూడా చేపట్టాలని లేదంటే మే 10న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. 60 శాతం జనాభా ఉన్న బీసీలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలేదన్నారు. బీసీ సబ్ కోటా పెడితేనే మహిళా బిల్లును అంగీకరిస్తామని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల కేటాయింపులో సామాజిక న్యాయం లేదన్నారు. ప్రధాని మోదీ బీసీలకు ఏం చేసిండో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ మహిళా హక్కుల గురించి మాట్లాడాలని అన్నారు. బీసీ సమాజం బీజేపీని క్షమించదని పేర్కొన్నారు. 2025 ఏప్రిల్‌లో బీసీ గణన చేపడతామని కేంద్ర కేబినెట్ నిర్ణయించి మాట తప్పారన్నారు. కానీ 9 శాతం ఉన్న అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారన్నారు. బీసీ కుల గణన చేపట్టిన తర్వాతే మోదీ తెలంగాణకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుంకరి మల్లేష్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వాడపల్లి సాయిబాబ, జిల్లా సెక్రటరీ జెల్లా ఆదినారాయణ, బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్, నళ్ల మధుయాదవ్, హరిగౌడ్, గూడూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ప్రధాని మోదీ తెలంగాణ
పర్యటనను అడ్డుకుంటాం
ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్


