బెయిల్‌ మంజూరుపై ప్రత్యేక దృష్టి అవసరం | - | Sakshi
Sakshi News home page

బెయిల్‌ మంజూరుపై ప్రత్యేక దృష్టి అవసరం

Apr 27 2026 8:48 AM | Updated on Apr 27 2026 8:48 AM

భువనగిరిటౌన్‌ : బెయిల్‌ మంజూరు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచించారు. శనివారం భువనగిరి పట్టణంలోని జిల్లా కోర్డులో జిల్లా స్థాయి కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.వివిధ క్రిమినల్‌ కేసుల్లో ఉన్న ఖైదీలకు సంబంధించిన కేసులు, వారు జైలులో ఎంత కాలం నుంచి ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయం అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, ప్రధాన సీనియర్‌ సివిల్‌ జడ్జి యం. ఉషశ్రీ, అదనపు జిల్లా కలెక్టర్‌ ఎ. భాస్కర్‌ రావు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, భువనగిరి సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ నెహ్రూ, డీఎస్పీలు రవీందర్‌, పి. శ్రీనివాస్‌ నా యుడు, యం. మధుసూదన్‌ రెడ్డి పాల్గొన్నారు.

మలేరియా నిర్మూలన ధ్యేయం

భువనగిరి: మలేరియా నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు పేర్కొన్నారు. శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మనోహర్‌, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాండునాయక్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ ఎన్‌. వంశీకృష్ణ, రామకృష్ణ, వీణ, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్‌ నిరోషా, విద్యార్థినులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించొద్దు

గుండాల : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించవద్దని, వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం గుండాల మండలం సుద్దాల గ్రామంలోని పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. అనంతరం తహసిల్దార్‌ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఎస్‌.హరికృష్ణ, ఏఈఓ పవన్‌, సెంటర్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

ఆలేరులో నిలిచిన

చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

ఆలేరు: వరంగల్‌ వైపు వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆలేరులో శనివారం రాత్రి కొద్దిసేపు ఆగింది. రైలు ఎస్‌–5 బోగి వీల్‌లో రాపిడి వల్ల నిప్పు రవ్వలు రావడంతో రాత్రి 9.15 గంటల నుంచి 20 నిమిషాలపాటు నిలిపివేశారు. ఫైర్‌ సేఫ్టీ సిలిండర్‌తో పొగలను ఆర్పివేసిన అనంతరం పంపించారు.

Advertisement
 
Advertisement
Advertisement