జాతీయ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ పోటీలకు ఎంపిక

Apr 27 2026 7:18 AM | Updated on Apr 27 2026 7:18 AM

బొమ్మలరామారం : మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థినులు బేతాల దేవిభవాని, బేతాల వైష్ణవి జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బి.నర్సింహ శనివారం తెలిపారు. తెలంగాణ షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వికారాబాద్‌ జిల్లా తాండూరులోని సెయింట్‌ మార్క్స్‌ పాఠశాలలో జనవరి 18న నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన దేవిభవాని, వైష్ణవి 5వ జాతీయస్థాయి సౌత్‌ జోన్‌ షూటింగ్‌ బాల్‌ క్రీడా పోటీలకు ఎంపికై నట్లు వెల్లడించారు. ఈ నెల 26,27 తేదీల్లో ఏపీలోని అనంతపురంలో జరగనున్న పోటీల్లో వారు పాల్గొననున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement