మఠంపల్లి : మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం రెండోరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్చీ బిషప్ ఉడుముల బాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవ మేత్రాసన పీఠాధిపతులు(బిషప్‌లు) ఉత్సవాలకు హాజరై శుభవార్త చర్చికి మేరీమాత పుణ్యక్షేత్రంగా నామకరణం చేశారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఉడుముల బాలతో కలిసి నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి ధ్రువకుమార్ ఆవిష్కరించారు. అదేవిధంగా వరంగల్, ఏపీలోని విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ఒంగోలు జిల్లాలకు చెందిన మేత్రాసన పీఠాధిపతులు ధ్రువకుమార్, గోవిందు జోజి, పొలిమేర జయరావు, చిన్నాబత్తిని భాగ్యయ్య, సగిలి ప్రకాష్, పిల్లి ఆంథోని దాస్, మైపన్ పాల్, వరంగల్ మేత్రాసన కార్యనిర్వహణ అధికారి విజయ్‌పాల్ పాల్గొని సమష్టి దివ్యబలిపూజ నిర్వహించారు.
మహాపునీత తల్లి మేరీమాత..
ఈ సందర్భంగా ఉడుముల బాల క్రైస్తవులకు సందేశమిచ్చారు. ఏసుక్రీస్తును లోకానికి అందించిన మహాపునీత మేరీమాత తల్లి పేరును శుభవార్త చర్చికి పెట్టడం సంతోషంగా ఉందన్నారు. క్రైస్తవులంతా ఏసుక్రీస్తు బోధనలను అనుసరించాలని ఆకాంక్షించారు. అంతకుముందు పీఠాధిపతులకు స్థానిక క్రైస్తవ మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. చర్చి కమిటీ ఆధ్వర్యంలో పీఠాధిపతులను సన్మానించారు. ఈ వేడుకలకు అధిక సంఖ్యలో సిస్టర్స్, బ్రదర్స్ హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి ఆవరణలో అన్నదానం చేశారు. సాయంత్రం మేరీమాత పుణ్యక్షేత్రం ఆరంభ రథోత్సవాన్ని(తేరు) నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి ధ్రువకుమార్ ప్రారంభించారు. ఈ రథోత్సవంలో క్రైస్తవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విచారణ గురువులు రాజారెడ్డి పోగుల, అశోక్, బాలరెడ్డి, బ్రదర్ వినోద్‌రెడ్డి, సిస్టర్లు సబీనా, రూబీ, ఏఎంపీ వైస్ చైర్మన్ స్రవంతీకిషోర్‌రెడ్డి, సర్పంచ్ వీరలక్ష్మిపాపయ్య, ఉప సర్పంచ్ శౌరీ, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు జయభారత్‌రెడ్డి, టీఆర్ బాలశౌరిరెడ్డి, కాకుమాను జోసెఫ్, గాలి చిన్నపురెడ్డి, ఆంథోనిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఫ నామకరణం చేసిన
క్రైస్తవ మేత్రాసన పీఠాధిపతులు
ఫ కొనసాగుతున్న చర్చి వార్షికోత్సవాలు
ఫ వైభవంగా సమష్టి దివ్యబలిపూజ


