నేటి నుంచి ఎద్దుల పందేలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎద్దుల పందేలు

Apr 27 2026 7:18 AM | Updated on Apr 27 2026 7:18 AM

మేరీమాత పుణ్యక్షేత్రం వార్షికోత్సవాలను పురస్కరించుకుని మఠంపల్లిలోని మాంట్‌ఫోర్డు ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం నుంచి మూడురోజుల పాటు ఉమ్మ డి రాష్ట్రస్థాయి ఎద్దుల పందేలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కోర్టును, ప్లడ్‌లైట్లను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా శుభోదయ యుజన సంఘం అద్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8గంటల నుంచి 11గంటల వరకు, సాయంత్రం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించి విజేతలకు అదేరోజు రాత్రి బహుమతి, షీల్డులు అందజేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement