రేపటి నుంచి నృసింహుడి జయంత్యుత్సవాలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి నృసింహుడి జయంత్యుత్సవాలు

Apr 25 2026 7:12 AM | Updated on Apr 25 2026 7:12 AM

30న ముగియనున్న

వేడుకలు

యాదగిరిగుట్ట : యాదగిరి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి వారి జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానుండగా ఈ నెల 30న ముగియనున్నాయి. ఇక పాతగుట్ట దేవాలయంలో 27 నుంచి 30వ తేదీ వరకు జయంత్యుత్సవాలను నిర్వహించనున్నారు.

పూజా కార్యక్రమాలు ఇలా..

26న ఉదయం 8గంటలకు విష్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుత్విక్‌ వరుణం, ఆస్థాన మండపంలో కుంకుమార్చన, యాగ ప్రవేశం, మృత్సంగ్రహణం, అంకురారోపణం, మండప ద్వార తోరణ పూజ, అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభ ఆరాధన, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనములు నిర్వహించనున్నారు. 11.30గంటలకు నిత్య పూర్ణాహుతి జరిపించనున్నారు. సాయంత్రం ఆలయంలో తిరు వేంకటపతి అలంకార సేవను ఊరేగించి, సాయమారాధన, నిత్య హవనం, లక్ష్మీనృసింహ సుదర్శన, మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి నిర్వహిస్తారు. 27న ఉదయం లక్ష పుష్పార్చన, యాగశాలలో ద్వారతోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుఃస్థానార్చన, నృసింహ లక్ష్మీ సుదర్శన, శతకం, గరుఢ మూల మంత్ర హోమం, నిత్యా పూర్ణాహుతి, సాయంత్రం వేళ కాళీయ మర్థన అలంకారణ సేవ నిర్వహించనున్నారు. అదేవిధంగా 28న సాయంత్రం గరుఢ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ, 29న శ్రీరామావతార అలంకార సేవ, 30న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అలంకార సేవతోపాటు, 10గంటలకు ద్వార తోరణ మహాబలి, మహా పూర్ణాహుతి, ఏకోత్తర సహస్ర కలశాభిషేకం, సహస్ర ఘటాభిషేకం జరిపించనున్నారు. సాయంత్రం వేద అర్చన, వేద స్వస్తి, నృసింహ ఆవిర్భావం, రుత్విక్‌ సన్మానం, మహా నివేదన, తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించి ఉత్సవాలను ముగించనున్నారు.

ఐదు రోజుల పాటు నిత్య కై ంకర్యాలు రద్దు

శ్రీస్వామి వారి జయంతి ఉత్సవాల సందర్భంగా 26 నుంచి 30వ తేదీ వరకు యాదగిరీశుడి ఆలయంలో నిర్వహించే శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీస్వామి వారి నిత్య, శాశ్వత కల్యాణం, 30న ఉదయం నిజాభిషేకం, సహస్రనార్చన వంటి పూజలు రద్దు చేసినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement