హుజూర్‌నగర్ : మండలంలోని కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన కీత శ్రీనివాసరావు థాయిలాండ్‌లోని శ్రీరచ నగరంలో ఈ నెల 17నుంచి 21 వరకు నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ పోటీల్లో ఇండియా తరపున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. రన్నింగ్, స్విమ్మింగ్, యోగా విభాగాల పోటీల్లో మూడు స్వర్ణం, ఒక కాంస్య పతకం సాధించారు. ఈ పోటీల్లో మొత్తం 49 దేశాలు పాల్గొన్నాయి. 5,000 మీటర్ల స్పీడ్ వాకింగ్ ఈవెంట్‌లో 31.45 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకం సాధించారు. 100 మీటర్ల స్ప్రింట్ పోటీలో 12.5 సెకన్ల టైమింగ్‌తో మూడవ స్థానం (బ్రాంజ్ మెడల్) పొందారు. స్విమ్మింగ్‌లో 200 మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో 1 నిమిషం 53 సెకన్ల టైమింగ్‌తో మరో స్వర్ణ పతకం సాధించారు. ట్రెడిషనల్ యోగా విభాగంలో అద్భుత ప్రదర్శన కనబర్చి మొదటి స్థానంతో స్వర్ణ పతకం అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రన్నింగ్, స్విమ్మింగ్, యోగా మూడు విభిన్న ఈవెంట్స్‌లో ఒకేసారి మూడు స్వర్ణ పతకాలు, ఒక కాంస్య పథకం సాధించడం అత్యంత అరుదైన ఘనత అని తెలిపారు. ఈ అద్భుత విజయం భారతదేశానికి గర్వకారణం మాత్రమే కాకుండా, వరల్డ్ రికార్డ్‌గా నిలిచే స్థాయిలో ప్రత్యేక విజయంగా గుర్తించబడిందని ఆయన పేర్కొన్నారు. దేశం తరుపున ఆడి మూడు స్వర్ణ, ఒక కాంస్య పథకం సాధించడం పట్ల పలువురు ఆయనను అభినందించారు.
దాడికి పాల్పడ్డ వారిపై కేసు
మోతె: పర్యావరణవేత్త, జలసాధన సమితి వ్యవస్థాపకుడు దుశ్చర్ల సత్యనారాయణపై దాడికి పాల్పడ్డ గొర్రెల కాపరుల కుటుంబసభ్యులపై శుక్రవారం మోతె పోలీసులు కేసు నమోదు చేశారు. మోతె మండల పరిధిలో రాఘవాపురంలో దుశ్చర్ల సత్యనారాయణకు ఉన్న 70 ఎకరాల అటవీ భూమిలో బయ్య లింగయ్య, మేకల కృష్ణయ్యలు అక్రమంగా గొర్రెలను మేపడంతోపాటు, వారి కుటుంబసభ్యులతో కలిసి దాడి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బయ్య రోషయ్య, మేకల కృష్ణయ్య, బయ్య గంగయ్య, బయ్య మల్లయ్య, బయ్య జస్వంత్, బయ్య సుమలత, బయ్య అనూష, బయ్య కల్పన, బయ్య ఉప్పమ్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోతె ఎస్సై అజయ్‌కుమార్ తెలిపారు.
ఫ మూడు స్వర్ణం, ఒక కాంస్య పతకం
సాధించిన కీత శ్రీనివాసరావు


