బదిలీల్లో వచ్చే అవకాశం
ఈ శాఖల్లో ఇన్‌చార్జ్‌లే దిక్కు..
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ప్రధాన శాఖలన్నీ ఇన్‌చార్జ్‌ల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఏ శాఖలోనూ పూర్తిస్థాయి అధికారులు లేరు. పదవీ విరమణ చేసిన, బదిలీ అయిన పోస్ట్‌లను భర్తీ చేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా ప్రధాన కార్యాలయాల్లో అధికారుల సీట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. అయితే ఒకే అఽధికారికి మూడు నాలుగు శాఖల బాధ్యతలు అప్పగించడంతో వారిపై పనిభారం పడడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఏ అధికారి ఏ శాఖలో విధులను నిర్వహిస్తున్నారో జనానికి అర్థంకాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం వేగవంతంగా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని శాఖలకు పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
నియామకాలపై సందిగ్ధం!
జిల్లాలోని చాలా శాఖల్లో ఇన్‌చార్జి అధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో ప్రజావాణిలో అర్జీలు పెట్టుకుంటున్నా ప్రజల సమస్యలు తీరడం లేదు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు, ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక, జనగణన, సంక్షేమ వారోత్సవాలు, బెల్టు షాపులకు అడ్డుకట్ట వేసేందుకు అధికారుల కొరత నెలకొంది. దీనికితోడు అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పనులు కుంటుపడుతున్నాయి. త్వరలో జరగనున్న బదిలీల్లోనైనా పూర్తిస్థాయి అధికారులను ప్రభుత్వం నియమిస్తుందా లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.
డీపీఓ, జెడ్పీ సీఈఓలూ ఇన్‌చార్జ్‌లే..
డీపీఓ సునంద గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు బదిలీ అయ్యారు ఆమె స్థానంలో డిప్యూటీ సీఈఓగా ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డికి అదనపు ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఇటీవల అయన సూర్యాపేట జెడ్పీ సీఈఓగా బదిలీపై వెళ్లారు. దీంతో డీఎల్‌పీఓకు ఇన్‌చార్జి డీపీఓగా నియమించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారాంను నల్లగొండ జిల్లా మత్స్య శాఖఅధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. భూగర్భ జలవన రుల శాఖకు ఆశాఖలో హైదరాబాద్‌లో డెప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతికుమార్‌కు ఇక్కడ అదనపు బాధ్యలు ఇచ్చారు. ఉద్యాన వన శాఖ అధికారి సుభాషిణి బదిలీపై వెళ్లడంతో ఏ మాధవికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. పౌరసరఫరాల శాఖ అధికారి బదిలీపై వెళ్లగా ఏఎస్‌ఓగా విధులను నిర్వహిస్తున్న రోజారాణికి పూర్తి బాధ్యతలు అప్పగించారు. డీఐఈఓ సీహెచ్.రమణి మహబూబ్‌నగర్‌కు బదిలీ కాగా బొందుగుల సురేష్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. నల్లగొండ జిల్లాపుడ్ ఇన్స్‌పెక్టర్‌గా నూతనంగా నియమితులైన శివశంకర్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జిగా ఉన్నారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉన్న అశ్విన్‌కుమార్ హైదరాబాద్‌కు బదిలీ కాగా ఆయన స్థానంలో జనగామ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ బాలకృష్ణకు జిల్లాలో అదనపు బాధ్యతలుఅప్పగించారు. తాజాఆయన స్థానంలో నెల రోజుల కోసం హైదరాబాద్‌నుంచి రబియాను డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా ఇన్‌చార్జిగా నియమించారు.
కార్మిక శాఖకు అధికారే లేరు!
జిల్లా కార్మిక శాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉన్నా ఇంతవరకు ఎవరిని నియమించలేదు. నల్లగొండ నుంచే ఆ శాఖను పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఆ శాఖకు జిల్లా అధికారి లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
త్వరలో ఉద్యోగుల బదిలీలు జరుగనుండడంతో ఆయా శాఖలకు అధికారులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న పలు శాఖల అధికారులు బదిలీ అయ్యే అవకాాశం ఉంది. ఇప్పటికే బదిలీ అయిన స్థానాలు, కొత్తగా బదిలీ అయ్యే స్థానాల్లో అధికారులను భర్తీ చేయనుండడంతో ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరించే అధికారులపై కాస్త పనిభారం తగ్గనుంది. దీంతో వారు బదిలీలపైనే కొంత ఆశలు పెట్టుకున్నారు.
గృహనిర్మాణ శాఖ మేనేజర్ దేవ్‌సింగ్ పదవీ విరమణ పొందగా ఆయన స్థానంలో డీఈఈ శ్రీరాములుకు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన జనగణన పర్యవేక్షించాల్సిన సీపీఓ వెంకటరమణ పదవీ విరమణ పొందగా జనగామ జిల్లా సీపీఓకు యాదాద్రి జిల్లా అఽధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసిన సైదులు స్థానంలో ఏఈఎస్ విష్ణుమూర్తికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. జిల్లా సహకారి అధికారిగా పదవీ విరమణ పొందిన శ్రీధర్ స్థానంలో జనగామ జిల్లా సహకార అఽధికారి మురళీరమణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారిగా ఉన్న పరాంకుశం సాహితి, జనగామ జిల్లా ఉపాధికల్పనాధికారిగా అదనపు బాధ్యతలతోపాటు జిల్లా సంక్షేమ శాఖలు అప్పగించారు. ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. డీఆర్‌ఓ జయమ్మకు మైనార్టీ సంక్షేమ శాఖ, డీఆర్‌డీఓగా విధులు నిర్వహిస్తున్న నాగిరెడ్డికి గిరిజన సంక్షేమ శాఖల బాధ్యతలను అప్పగించారు. మైనింగ్ ఏడీ రాఘవరెడ్డిని కరీంనగర్ ఏడీ డిప్యుటేషన్‌పై పంపించిన అధికారులు సహాయ జియాలజిస్టుగా ఉన్న రవికుమార్ జిల్లా మైనింగ్ శాఖలో అదనపు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.
ఫ ఎకై ్సజ్, హౌసింగ్, పంచాయతీ రాజ్ శాఖలకు జిల్లా అధికారులు కరువు
ఫ మరికొన్ని శాఖల్లోనూ కొందరికి అదనపు బాధ్యతలు
ఫ జనగణన బాధ్యతలు చూసే సీపీఓ పోస్ట్ ఖాళీగానే..


