మాజీ స్పీకర్‌ అరెస్టు.. | - | Sakshi
Sakshi News home page

మాజీ స్పీకర్‌ అరెస్టు..

Apr 25 2026 7:12 AM | Updated on Apr 25 2026 7:12 AM

మాజీ స్పీకర్‌ అరెస్టు..

ఆలేరు : మండలి ప్రతిపక్ష నేత, శాసనసభ మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారిని ఆలేరులో పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మృతి చెందిన డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నర్సంపేటకు మధుసూదనాచారి కారులో బయలుదేరారు. సమాచారం తెలుసుకున్న ఆలేరు పోలీసులు స్థానిక బైపాస్‌లో ఆయన కారును ఆపి ముందస్తు జాగ్రత్తలో భాగంగా అరెస్టు చేశారు. అనంతరం ఆయనను పోలీసు బందోబస్తు మధ్య భువనగిరిలోని ఎస్పీ కార్యాలయానికి తరలించినట్టు ఎస్‌ఐ వినయ్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement