చాలా మంది రైతులు వరికోతలు మొదలు పెట్టారు. మా వ్యవసాయ బావి వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ధాన్యం రాశులతో నిండి పోయింది. వెంటవెంటనే ధాన్యం కొనుగోలు చేస్తే తర్వాత వచ్చే రైతులకు ఇబ్బందులు ఉండవు.
– పి.లింగయ్య, రామన్నపేట
వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం తక్షణమే ఏర్పాటు చేయాలి. కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధర కల్పిస్తూ కనీస వసతులు ఏర్పాటు చేయాలి. వరి కోతలు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా నేటికీ కొనుగోలు కేంద్రాలు లేక ధాన్యాన్ని ప్రైవేట్ దళారులకు విక్రయించాల్సి వస్తుంది. – కొమురయ్య,
వెల్మజాల, గుండాల మండలం


