ట్రాక్టర్ బోల్తా..
గుర్రంపోడు మండలంలో కరెంట్ స్తంభాలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు.
- 8లో
- 9లో
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి మంగళవారం పరిశీలించారు. పాఠకులను పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రామన్నపేట, వలిగొండ, ఆలేరు, తుర్కపల్లి గ్రంథాలయాలను సందర్శించారు. మరమ్మతులు చేపట్టేందుకు వెంటనే నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. మండల గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన లైబ్రరీ సెస్ తక్కువగా అందుతుందని, పూర్తిస్థాయిలో సెస్ వసూలు అయ్యేలా చూడాలని కోరగా కలెక్టర్ సానుకూలత వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఎండీ అవైస్ ఉన్నారు.
కార్పొరేట్ స్థాయి సేవలు అందించాలి
సాక్షి,యాదాద్రి : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులు ఎన్‌క్యూఏఎస్ ప్రమాణాలతో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 68 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఎంహెచ్‌ఓ మనోహర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


