ధ్వజారోహణం.. భేరీ పూజ | - | Sakshi
Sakshi News home page

ధ్వజారోహణం.. భేరీ పూజ

Feb 20 2026 7:01 AM | Updated on Feb 20 2026 7:01 AM

ధ్వజా

ధ్వజారోహణం.. భేరీ పూజ

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కనుల పండువగా కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం ఉదయం అగ్ని దేవుడికి ఆరాధన, హవనం, గరుడ ఆళ్వారుడికి ఇష్ట నైవేద్యం, ధ్వజపూజ, రాత్రి దేవతాహ్వానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా వేడుకల్లో కలెక్టర్‌ హనుమంతరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ భవానీ శంకర్‌, ఆలయాధికారులు, అర్చకులు, పారాయణీకులు, వేద పండితులు, రుత్వికులు, యాజ్ఞీకులు పాల్గొన్నారు.

ధ్వజపటం ఊరేగింపు..

గురువారం ఉదయం నిత్యారాధనలు చేపట్టిన అనంతరం ఉత్తర మాడ వీధిలోని యాగశాలలో యాజ్ఞీకులు హోమాది పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రచార్యులు, యాజ్ఞీకులు నిత్య పూర్ణాహుతి జరిపించారు. అనంతరం గరుడ ఆళ్వారుడి పటాన్ని, ప్రత్యేక పల్లకీపై ఉత్సవమూర్తులను మాడ వీధుల్లో ఊరేగిస్తూ ముఖ మండపంలోని ధ్వజ స్తంభం వద్దకు తీసుకొచ్చారు. ధ్వజ స్తంభానికి గరుడ ఆళ్వారుడి పటాన్ని కట్టి పూజలు చేశారు. అర్చకులు గరుడ ముద్దలను తీసుకొచ్చి గరుత్మంతుడి వద్ద పూజలు చేసి ధ్వజ స్తంభం పైకి ఎగురవేశారు. గరుడ ప్రసాదం తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. సాయంత్రం నిత్యారాధనల అనంతరం ఆలయ ముఖ మండపంలో భేరీ పూజ నిర్వహించారు. అనంతరం ముఫ్పై మూడు కోట్ల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ దేవతాహ్వానం, హవనం జరిపించారు.

సకల దేవతలకు ఆహ్వానం

ఫ యాదగిరి క్షేత్రంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

ఫ నేటి నుంచి అలంకార సేవలకు శ్రీకారం

ఆలయంలో నేడు..

బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అలంకార సేవలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం మత్స్యావతార అలంకార సేవలో స్వామివారు దర్శనమిస్తారు. అనంతరం వేద పారాయణం ఉంటుంది. రాత్రి 7గంటలకు శేష వాహన సేవ నిర్వహిస్తారు.

ధ్వజారోహణం.. భేరీ పూజ1
1/4

ధ్వజారోహణం.. భేరీ పూజ

ధ్వజారోహణం.. భేరీ పూజ2
2/4

ధ్వజారోహణం.. భేరీ పూజ

ధ్వజారోహణం.. భేరీ పూజ3
3/4

ధ్వజారోహణం.. భేరీ పూజ

ధ్వజారోహణం.. భేరీ పూజ4
4/4

ధ్వజారోహణం.. భేరీ పూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement