గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Feb 20 2026 7:01 AM | Updated on Feb 20 2026 7:01 AM

గుర్త

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కనగల్‌, నల్లగొండ : కనగల్‌ మండలంలోని దర్వేశిపురం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కనగల్‌ మండల కేంద్రానికి చెందిన ఏటెల్లి పరశురాం(34) బైక్‌పై నల్లగొండకు వెళ్తుండగా.. మార్గమధ్యలో దర్వేశిపురం గ్రామ స్టేజీ సమీపంలో గుర్తుతెలియని వాహనం అతడి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పరశురాం తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో కొండమల్లేపల్లిలో నిర్వహించిన బత్తాయి రైతుల సమావేశంలో పాల్గొని తిరిగి నల్లగొండకు వస్తున్న కలెక్టర్‌ బడుగు చంద్రశేఖర్‌ ప్రమాదాన్ని గుర్తించి తన కారును ఆపారు. ఆయన వాహనం దిగి వచ్చి పోలీసులకు సమాచారం అందించి, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు గాను 108 వాహనానికి ఫోన్‌ చేశారు. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఎక్కించే వరకు కలెక్టర్‌ అక్కడే వేచి ఉన్నారు. ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా ఆయన దగ్గరుండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అయితే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే పరశురాం మృతిచెందాడు. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

ఫ కనగల్‌ మండలం దర్వేశిపురం

గ్రామ స్టేజీ వద్ద ప్రమాదం

ఫ అటుగా వెళ్తూ వాహనం దిగి వచ్చి

అంబులెన్స్‌కు, పోలీసులకు ఫోన్‌ చేసిన కలెక్టర్‌ చంద్రశేఖర్‌

ఫ క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఎక్కించే వరకు అక్కడే ఉన్న కలెక్టర్‌

ఫ మార్గమధ్యలో మృతిచెందిన క్షతగాత్రుడు

19 ఎన్‌ఎల్‌సి 202. పరశురాం (ఫైల్‌)

19 ఎన్‌ఎల్‌సి 203. 108 వాహనానికి ఫోన్‌ చేస్తున్న కలెక్టర్‌ చంద్రశేఖర్‌

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి1
1/1

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement