తనయుడి కళ్లెదుటే తండ్రి మృతి | - | Sakshi
Sakshi News home page

తనయుడి కళ్లెదుటే తండ్రి మృతి

Feb 20 2026 7:01 AM | Updated on Feb 20 2026 7:01 AM

తనయుడి కళ్లెదుటే  తండ్రి మృతి

తనయుడి కళ్లెదుటే తండ్రి మృతి

చౌటుప్పల్‌ : తండ్రి, కుమారుడు కలిసి స్కూటీపై వెళ్తుండగా.. మృత్యురూపంలో వచ్చిన డీసీఎం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమారుడి కళ్లెదుటే తండ్రి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎల్లగిరి గ్రామ శివారులో గురువారం జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవం గ్రామానికి చెందిన కోటిచుక్కల సుబ్రహ్మణ్యం(48) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటున్నాడు. గురువారం ఉదయం సుబ్రహ్మణ్యం, అతడి కుమారుడు అశోక్‌ కలిసి స్కూటీపై తమ స్వగ్రామం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. మధ్యాహ్నం 3.30గంటల సమయంలో చౌటుప్పల్‌ మండలం ఎల్లగిరి గ్రామ శివారులో పేదరాశి పెద్దమ్మ హోటల్‌ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో వారిద్దరు రోడ్డుపై ఎగిరిపడ్డారు. డీసీఎం సుబ్రహ్మణ్యం తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. తన కళ్ల ముందే తండ్రి మృతిచెందడంతో సుబ్రహ్మణ్యం కుమారుడు అశోక్‌ బోరున విలపించాడు. తీవ్రంగా గాయపడిన అశోక్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్‌ సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

స్కూటీపై వెళ్తుండగా ఢీకొట్టిన డీసీఎం

చౌటుప్పల్‌ మండలం

ఎల్లగిరి గ్రామ స్టేజీ వద్ద ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement