టెండర్ ఓటు అంటే..
చిట్యాల : కొన్ని సందర్భాల్లో ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పటికే అతడి పేరిట ఉన్న ఓటును వేసినట్లు అధికారులు చెబితే ‘టెండర్ ఓటు’ను కోరవచ్చు. ఓటరు తన గుర్తింపు, ధ్రువీకరణ కార్డును ఎన్నికల అధికారులకు చూపించి మళ్లీ ఓటు వేయవచ్చు. దీనినే టెండర్ ఓటు అంటారు. ఇలా వేసిన ఓటుతో పాటు వేలి ముద్రలు, గుర్తింపు వివరాలను ప్రత్యేక డబ్బాలో భద్ర పరుస్తారు. అయితే టెండర్ ఓటును ఫలితాల్లో మాత్రం లెక్కింపులోకి తీసుకోరు. కానీ ఎన్నికల అధికారులు రిజిస్టర్‌లో నమో దు చేస్తారు. దాంతో ఆ పోలీంగ్ కేంద్రంలో తప్పుడు ఓటు వేసినట్లు రికార్డు అవుతుంది. ఎన్నికల ఫలితాలకు సంబంధించి కేసు కోర్టుకు వెళితే ఆ పోలీంగ్ కేంద్రంలో తప్పుడు ఓటింగ్ జరిగినట్లు నిర్ధారణకు ఉపయోగపడుతుంది.


